Back to FeedQuickToday Shorts

Telangana
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తెలుగు రాష్ట్రాలకు రెయిన్ అలర్ట్.. రేపు ఈ జిల్లాల్లో భారీ వర్షాలు!
రెండు తెలుగు రాష్ట్రాలకు వాతావరణ శాఖ అలర్ట్ జారీ చేసింది.
రేపు పలు జిల్లాల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురుస్తాయని వెల్లడించింది.
తెలంగాణలోని ములుగు, భద్రాద్రి, ఖమ్మం, నల్గొండ, సూర్యాపేట, మహబూబాబాద్, వరంగల్, హన్మకొండ, జనగాం, సిద్దిపేట, కామారెడ్డి, నాగర్ కర్నూల్ జిల్లాల్లో భారీ వర్షాలు పడతాయని వాతావరణ శాఖ తెలిపింది.
అలాగే ఏపీలోని మన్యం, అల్లూరి, పోలవరం, కాకినాడ, తూర్పుగోదావరి, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, పల్నాడు, ప్రకాశం, కర్నూలు, అనంతపురం, శ్రీ సత్యసాయి, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి జిల్లాల్లో పిడుగులతో కూడిన వర్షాలు కురుస్తాయని ప్రజలను అప్రమత్తం చేసింది.
Tags:#Telangana#National#Shorts





