Back to FeedQuickToday Shorts
District
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
జగ్జీవన్‌రావ్ విగ్రహాన్ని ఢీకొన్న లారీ
గ్రిల్స్ పాక్షికంగా ధ్వంసం.. విగ్రహానికి నష్టం
తొర్రూరు సెప్టెంబర్ 20(క్విక్ టుడే న్యూస్)
డివిజన్ కేంద్రంలోని పాల కేంద్రం సమీపంలో ఆదివారం తెల్లవారుజామున ఓ లారీ జగ్జీవన్‌రావ్ విగ్రహాన్ని ఢీకొట్టింది.ఈ ఘటనలో విగ్రహం చుట్టూ ఏర్పాటు చేసిన గ్రిల్స్ పాక్షికంగా ధ్వంసం కాగా, జగ్జీవన్‌రావ్ విగ్రహం కూడా దెబ్బతిన్నట్లు సమాచారం.ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది.
సమాచారం అందుకున్న పోలీసులు ఘటనాస్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
పూర్తి వివరాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది.



