
జనగామ బీరప్పగడ్డలో ఘనంగా కళావృత్తి కార్యక్రమం
ముఖ్య అతిథిగా మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్
జనగామ, అక్టోబర్ 17 (క్విక్ టుడే న్యూస్):
జనగామ జిల్లా కేంద్రంలోని బీరప్పగడ్డలో మహారాణి దుర్గా మాయ ఆధ్వర్యంలో కళావృత్తి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జనగామ మున్సిపల్ చైర్మన్ కడకంచి బాలమణి శ్రీనివాస్ ముఖ్య అతిథిగా హాజరయ్యారు.ఈ సందర్భంగా కమిటీ సభ్యులు ముఖ్య అతిథికి శాలువా కప్పి.ఘనంగా సన్మానించారు. అనంతరం రాజేశ్వరాచారి అయ్యవార్లతో మంత్రోచ్ఛారణ చేయిస్తూ సంప్రదాయబద్ధంగా స్వాగతం పలికి ఆశీర్వాదాలు అందజేశారు.ఈ సందర్భంగా ముఖ్య అతిథి కడకంచి బాలమణి శ్రీనివాస్ మాట్లాడుతూ కళలు,సంప్రదాయాలను పరిరక్షిస్తూ కళాకారులను ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. ఇటువంటి కార్యక్రమాలు ప్రజల్లో సాంస్కృతిక చైతన్యాన్ని పెంపొందించడంతో పాటు మన.సంప్రదాయాలను భావితరాలకు అందించేందుకు దోహదపడతాయని పేర్కొన్నారు.కళాకారులను తీర్చిదిద్దడంలో గురువుల పాత్ర ఎంతో కీలకమని నిర్వాహకులు పేర్కొన్నారు. ప్రత్యేకంగా మైత్రేయ కూచిపూడి కళా క్షేత్రం గురువు సుకేష్ అందిస్తున్న శిక్షణ,కళాకారుల ప్రతిభను వెలికితీసేందుకు చేస్తున్న కృషిని అభినందించారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు, స్థానికులు, కళాకారులు, నిర్వాహకులు తదితరులు.పాల్గొన్నారు.





