
జయేశ్ రంజన్‌కు స్థానచలనం.. విద్యుత్ శాఖ ప్రత్యేక సీఎస్‌గా వికాస్ రాజ్
తెలంగాణలో కీలక శాఖల్లో పనిచేస్తున్న పలువురు ఐఏఎస్ అధికారులను ప్రభుత్వం బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది.
సీనియర్ ఐఏఎస్ అధికారి జయేశ్ రంజన్‌ను మెట్రోపాలిటన్ ఏరియా, అర్బన్ డెవలప్మెంట్ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి బాధ్యతల నుంచి తప్పించి అటవీ, పర్యావరణ శాఖల ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా నియమించింది.
ఆయన అదనపు బాధ్యతల్లో ఉన్న క్రీడలు, హెరిటేజ్ తెలంగాణ శాఖలను వాణి ప్రసాద్‌కు అప్పగించింది.
హెచ్ఎండీఏ కమిషనర్ సర్ఫరాజ్ అహ్మద్‌కు మెట్రోపాలిటన్ ఏరియా సెక్రటరీతో పాటు జీహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజిగిరి మున్సిపల్ కార్పొరేషన్ల ప్రత్యేక అధికారి బాధ్యతలు కేటాయించింది.
విద్యుత్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి నవీన్ మిత్తల్‌ను పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖకు బదిలీ చేసింది.
విద్యుత్ శాఖ బాధ్యతలను వికాస్ రాజ్‌కు అప్పగించింది.
రోడ్లు, భవనాలు, రవాణా శాఖల కార్యదర్శిగా ఇలంబర్తిని నియమించింది.
దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్‌కు రెవెన్యూ శాఖ బాధ్యతలు అప్పగించింది.



