Back to FeedQuickToday Shorts
District
Jul 16, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వర్షాల కోసం రైతన్న ఎదురుచూపు..
ట్యాంకర్లతో వరి నారుకు ప్రాణం పోస్తున్న రైతులు
మహబూబాబాద్ జిల్లా జూలై 16(క్విక్ టుడే న్యూస్)
బయ్యారం మండలం గంధంపల్లి గ్రామంలో వర్షాభావం రైతులను తీవ్రంగా కలవరపెడుతోంది. నాటేందుకు సిద్ధం చేసిన వరి నారు ఎండిపోకుండా కాపాడుకునేందుకు రైతులు ట్యాంకర్ల ద్వారా నీటిని తెప్పించి పోస్తూ పంటను సంరక్షిస్తున్నారు.
గంధంపల్లి గ్రామానికి చెందిన రైతు బాలకృష్ణ తన రెండు ఎకరాల వరి నారును బ్రతికించేందుకు ట్యాంకర్లతో నీటిని పోయిస్తూ తీవ్ర శ్రమ పడుతున్నారు. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేకపోవడం, సాగునీటి కొరత కారణంగా రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.ప్రతి నీటి చుక్క పంటకు ప్రాణంగా మారిన పరిస్థితుల్లో, ఖర్చు భరిస్తూ నారును కాపాడుకునేందుకు రైతులు పోరాడుతున్నారు. త్వరగా వర్షాలు కురిసి పంటలు దక్కాలని గంధంపల్లి రైతులు ఆశగా ఎదురుచూస్తున్నారు.



