Back to FeedQuickToday Shorts

General
Aug 6, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
తల్లిపాలపై అవగాహన కార్యక్రమం...
తల్లిపాలే శిశువుకు తొలి రక్షణ కవచం: సీడీపీఓ...
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్)
ప్రపంచ తల్లిపాల వారోత్సవాల సందర్భంగా మణుగూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అన్నారం అంగన్ వాడీ కేంద్రంలో బుధవారం తల్లిపా ల ప్రాముఖ్యతపై అవగాహన కార్యక్ర మాన్ని నిర్వహించారు.మణుగూరు ప్రాజెక్టు సీడీపీఓ జయలక్ష్మి హాజరై మాట్లాడారు, శిశువు పుట్టిన గంట లోపే తల్లిపాలు పట్టించడం ఎంతో ముఖ్యమని తెలిపారు.తొలి ఆరు నెలల వరకు శిశువుకు కేవలం తల్లిపాలే అందించాలని,నీరు,తేనె పదార్థాలు ఇవ్వకూడదని సూచించా రు.తల్లిపాలలో ఉండే పోషకాలు, రోగనిరోధక శక్తిని పెంచే గుణాలు శిశువు శారీరక, మానసిక ఎదుగు దలకు ఎంతగానో దోహదప డతాయ ని వివరించారు.మణుగూరు సెక్టార్ సూపర్వైజర్ భద్రమ్మ, అంగన్వాడీ టీచర్ పి.కళావతి,ఆశా వర్కర్లు, గర్భిణీలు,బాలింతలు,గ్రామస్తులు పాల్గొన్నారు.



