
స్నేహబంధం వెలకట్టలేనిది
మున్సిపల్ చెర్మన్ తూనం శ్రవణ్ కుమార్
తొర్రూరు, ఆగస్టు2(క్విక్ టుడే న్యూస్):
స్నేహబంధం వెలకట్టలేనిదని తొర్రూరు మున్సిపల్ చైర్మన్ తూనం శ్రావణ్ కుమార్ అన్నారు.పట్టణ కేంద్రంలోని స్థానిక విశ్రాంతిభవనంలో కల్లూరి నాగేంద్ర చారి ఆధ్వర్యంలో ఆదివారం జాతీయ స్నేహితుల దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు.ఈ సందర్భంగా మిత్రులు ఎంతో ఉత్సాహంగా ఒకరికొకరు ఫ్రెండ్షిప్ రాఖీలను కట్టుకుని తమ స్నేహబంధాన్ని ఆత్మీయంగా పంచుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అన్ని బంధాల స్నేహ బంధం గొప్పదని,స్నేహితుల త్యాగనిరతి వెలకట్టలేనిదని తెలిపారు. మనిషి జీవితంలో రక్త సంబంధం కంటే స్నేహబంధం గొప్పదని తెలిపారు. కుల,మత,వర్గ భేదాలు లేని ఏకైక స్వచ్ఛమైన బంధం స్నేహమేనని పేర్కొన్నారు. నిజమైన స్నేహితుడు ఆపదలో వెన్నంటి ఉంటాడని, త్యాగాలు ఎప్పటికీ మర్చిపోలేనివని పేర్కొన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ సోమ రజిని రాజశేఖర్, కౌన్సిలర్లు ముద్దసాని సురేష్,తూర్పాటి రవి,జర్నలిస్టులు దూలం శ్రీనివాస్,వజనపల్లి అనిల్ కుమార్,వెంకటరమణ యాదగిరి నాయక్,స్నేహితులు దామెర సురేష్,కుర్ర శ్రీనివాస్,దేవరకొండ కృష్ణ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.





