Back to FeedQuickToday Shorts
District
Aug 2, 2026Short Read
పోలీస్ ఉద్యోగార్థులకు ఉచిత కోచింగ్..
స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాన్ని పరిశీలించిన డీఎస్పీ
తొర్రూరు ఆగస్టు 02
మహబూబాబాద్ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో పోలీస్ కానిస్టేబుల్,సబ్-ఇన్స్పెక్టర్ (ఎస్ఐ) ఉద్యోగాలకు అభ్యర్థులను సిద్ధం చేయడానికి నిర్వహిస్తున్న ఉచిత కోచింగ్ కార్యక్రమంలో భాగంగా, తొర్రూరులోని సమత డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన స్క్రీనింగ్ పరీక్ష కేంద్రాన్ని డీఎస్పీ కృష్ణ కిషోర్, సీఐ గణేష్‌తో పాటు సబ్‌డివిజన్ ఎస్ఐలు పరిశీలించారు.
ఈ సందర్భంగా పరీక్షా కేంద్రంలో ఏర్పాట్లు,అభ్యర్థులకు కల్పించిన సౌకర్యాలు, పరీక్ష నిర్వహణ తీరును అధికారులు పరిశీలించి సంబంధిత సిబ్బందికి అవసరమైన సూచనలు చేశారు.అభ్యర్థులు క్రమశిక్షణతో పరీక్షకు హాజరై, ఈ ఉచిత కోచింగ్ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని ఉద్యోగ లక్ష్యాన్ని సాధించాలని పోలీస్ అధికారులు సూచించారు.





