Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
పొగాకు రైతులకు ఊరట.. వడ్డీ లేని రుణాలు, కిలోకు రూ.10 సాయం!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 3 :- పొగాకు రైతులను ఆదుకునేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కీలక నిర్ణయాలు తీసుకున్నాయి.
కేంద్ర ప్రభుత్వం ప్రతి పొగాకు రైతుకు రూ.50 వేల వరకు వడ్డీ లేని రుణం ఇస్తామని ప్రకటించి శుభవార్త చెప్పింది.మరోవైపు, లో గ్రేడ్, ఆఫ్ స్టైల్ పొగాకు సాగు చేసి భారీ నష్టాలు చవిచూసిన రైతులను ఆదుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చింది.
నష్టపోయిన రైతులకు కిలో పొగాకుకు రూ.10 చొప్పున ఆర్థిక సహాయం అందించనుంది.
ఈ సీజన్లో 140 మిలియన్ కేజీల పొగాకు సాగుకు అనుమతి ఉండగా, రైతులు ఏకంగా 240 మిలియన్ కేజీలు పండించారు.
ఈ అదనపు ఉత్పత్తి కారణంగా మార్కెట్లో పొగాకు ధరలు పడిపోయి రైతులు నష్టాల పాలయ్యారు.





