
కాంగ్రెస్ ఎమ్మెల్సీ అభ్యర్థులు ఖరారు
మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్‌కు సామ రామ్మోహన్‌రెడ్డి.. నల్గొండ-ఖమ్మం-వరంగల్‌కు సర్వోత్తం రెడ్డి
హైదరాబాద్, సెప్టెంబర్ 30, (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణలో త్వరలో ఖాళీ కానున్న రెండు పట్టభద్రుల ఎమ్మెల్సీ స్థానాలకు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను ఖరారు చేసింది. మహబూబ్‌నగర్-రంగారెడ్డి-హైదరాబాద్ స్థానానికి సామ రామ్మోహన్‌రెడ్డి, నల్గొండ-ఖమ్మం-వరంగల్ స్థానానికి సర్వోత్తం రెడ్డిని అభ్యర్థులుగా ఏఐసీసీ ప్రకటించింది. అభ్యర్థుల ఎంపికలో భాగంగా టీపీసీసీ ఆరుగురి పేర్లను పరిశీలించి అధిష్ఠానానికి పంపగా.. ఏఐసీసీ తుది నిర్ణయం తీసుకుంది. రెండు స్థానాలకు రెడ్డి సామాజిక వర్గానికి చెందిన అభ్యర్థులను ఎంపిక చేయడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. కాగా, సర్వోత్తం రెడ్డికి రాజకీయ కుటుంబ నేపథ్యం ఉంది. ఆయన నల్గొండ జిల్లాకు చెందిన మాజీ మంత్రి, దివంగత నేత రాంరెడ్డి దామోదర్‌రెడ్డి కుమారుడు. అభ్యర్థుల ప్రకటనతో రానున్న ఎమ్మెల్సీ ఎన్నికలపై రాజకీయ పార్టీల దృష్టి కేంద్రీకృతం కానుంది.



