
కాంగ్రెస్ 1000 రోజుల పాలనపై నేడు కేటీఆర్ చార్జిషీట్ విడుదల
హైదరాబాద్, సెప్టెంబర్ 2:
కాంగ్రెస్ ప్రభుత్వ 1000 రోజుల పాలనలో హామీల అమలు విఫలమైందంటూ బీఆర్ఎస్ పోరుబాటకు సిద్ధమైంది. బుధవారం ఉదయం 11 గంటలకు తెలంగాణ భవన్లో పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కాంగ్రెస్ పాలనపై చార్జ్‌షీట్ విడుదల చేయనున్నారు. ఆరు గ్యారెంటీలు, 420 హామీలు, 11 డిక్లరేషన్ల అమలును ప్రశ్నిస్తూ ఈ నెల 8 వరకు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు చేపట్టాలని పార్టీ నిర్ణయించింది. ధర్నాలు, రైతు సదస్సులు, వంటావార్పులు, యువత, ఆటో ర్యాలీలు, ప్రజావాణి కార్యక్రమాలతో ప్రభుత్వంపై ఒత్తిడి పెంచాలని బీఆర్ఎస్ వ్యూహం రచించింది. మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు జిల్లాల్లో సన్నాహక సమావేశాలు నిర్వహించి పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేశారు. కాంగ్రెస్ ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మోసం చేసిందని వేముల ప్రశాంత్‌రెడ్డి, నిరంజన్‌రెడ్డి, శ్రీనివాస్‌గౌడ్, దాస్యం వినయ్‌భాసర్ విమర్శించారు. హామీలు నెరవేర్చే వరకు ప్రజల తరఫున పోరాటం కొనసాగిస్తామని వారు ప్రకటించారు.





