Back to FeedQuickToday Shorts

Telangana
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
'మహాలక్ష్మి' పథకంతో ఆల్ టైమ్ రికార్డు: ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి
తెలంగాణలో 'మహాలక్ష్మి' పథకం ద్వారా ఉచిత బస్సు ప్రయాణం చేసే మహిళల సంఖ్య భారీగా పెరిగిందని ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి తెలిపారు.
2023-24లో రోజుకు సగటున 29.42 లక్షల మంది మహిళలు ప్రయాణించగా, 2026-27 నాటికి ఆ సంఖ్య 37.09 లక్షలకు చేరుకుని ఆర్టీసీ చరిత్రలోనే ఆల్ టైమ్ రికార్డు సృష్టించిందని వెల్లడించారు.ఈ పథకం ద్వారా ఇప్పటివరకు మహిళలకు దాదాపు ₹2,428 కోట్లు ఆదా అయ్యాయని వివరించారు.
ప్రయాణికుల రద్దీకి తగినట్లుగా బస్సుల సంఖ్యను, సౌకర్యాలను మరింతగా పెంచుతున్నామని ఆయన స్పష్టం చేశారు.



