
ఎల్ఆర్ఎస్ దరఖాస్తుదారులకు మరో అవకాశం.. 25% రాయితీకి గడువు పొడిగింపు
LRS: తెలంగాణ ప్రభుత్వం ఎల్ఆర్ఎస్ (లేఅవుట్ రెగ్యులరైజేషన్ స్కీమ్) దరఖాస్తుదారులకు మరోసారి ఊరటనిచ్చింది.
ఎల్ఆర్ఎస్ ఫీజులు, ఇతర చార్జీల చెల్లింపుపై అమలులో ఉన్న 25 శాతం రాయితీని మరో నాలుగు నెలలు కొనసాగించాలని నిర్ణయించింది.
ఈ రాయితీ 2026 ఆగస్టు 1 నుంచి నవంబర్ 30 వరకు అమల్లో ఉంటుందని ప్రభుత్వం వెల్లడించింది.
ఈ మేరకు జీఓ ఎంఎస్ నంబర్ 213ను జారీ చేస్తూ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేశ్ రంజన్ ఉత్తర్వులు విడుదల చేశారు.
నిర్ణయంతో పెండింగ్లో ఉన్న ఎల్ఆర్ఎస్ బకాయిలను రాయితీతో చెల్లించుకునే అవకాశం దరఖాస్తుదారులకు లభించనుంది.
గడువు పొడిగింపు ద్వారా మరింత మంది లబ్ధిదారులు తమ దరఖాస్తుల ప్రక్రియను పూర్తి చేసుకునే అవకాశం ఉంటుందని అధికారులు భావిస్తున్నారు.
ఉత్తర్వులను వెంటనే అమలు చేయాలని సంబంధిత శాఖలను ప్రభుత్వం ఆదేశించింది.





