
ప్రజా పోరాటాలలో ఆయన మార్గదర్శి...
కామ్రేడ్ అయోధ్య ప్రథమ వర్ధంతి సందర్భంగా మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ నివాళి...
క్విక్ టు డే న్యూస్,( భద్రాద్రి జిల్లా ప్రతినిధి).
పేదలు, బడుగు బలహీన వర్గాల సంక్షేమం కోసం జీవితాంతం పోరాడిన బొల్లోజు అయోధ్య చారి పేద ప్రజల గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని మాజీ జడ్పీటీసీ పాల్వంచ దుర్గ అన్నారు.
ఈ నెల 6 న ఆయన ప్రథమ వర్ధంతి సందర్భంగా ఘన నివాళులు అర్పించిన ఆమె, ప్రజా పోరాటాలలో అయోధ్య చూపిన మార్గం ఎప్పటికీ స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.
సామాన్య ప్రజల సమస్యల పరిష్కారం కోసం నిరంతరం కృషి చేసిన ఆయన సేవలను ఈ సందర్భంగా గుర్తు చేసుకున్నారు.
పదవులు, హోదాలకు అతీతంగా ప్రజల పక్షాన నిలబడి పోరాటాలు చేసిన తీరు ఆదర్శనీయమని అన్నారు.
పేదల అభ్యున్నతి, సామాజిక న్యాయం కోసం అయోధ్య చేసిన కృషి మరువలేనిదని పాల్వంచ దుర్గ పేర్కొన్నారు.
ప్రజా ఉద్యమాల చరిత్రలో ఆయనకు ప్రత్యేక స్థానం ఉంటుందని తెలిపారు.
ఆయన ఆశయాలను కొనసాగించడమే నిజమైన నివాళి అని పేర్కొన్నారు.




