Back to FeedQuickToday Shorts

District
Oct 4, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డుతో రెడ్డి రత్నాకర్ రెడ్డికి ఘన సత్కారం
పాలకుర్తి, అక్టోబర్ 4(క్విక్ టుడే న్యూస్ ):
తెలంగాణ రాష్ట్రానికి చెందిన కళలు, సంస్కృతి రంగాల్లో విశిష్ట సేవలు అందిస్తున్న వారిని గుర్తించి అందించే **“ప్రైడ్ ఆఫ్ తెలంగాణ అవార్డ్స్–2026”**లో ఆర్ట్ & కల్చర్ విభాగంలో రెడ్డి రత్నాకర్ రెడ్డి అవార్డు అందుకున్నారు. కళలు, సంస్కృతి రంగంలో ఆయన చేస్తున్న సేవలను గుర్తించిన నిర్వాహకులు ఈ ప్రతిష్ఠాత్మక పురస్కారానికి ఎంపిక చేశారు. అవార్డు అందుకోవడంతో పలువురు కళాభిమానులు, స్నేహితులు, శ్రేయోభిలాషులు ఆయనకు అభినందనలు తెలిపారు. తెలంగాణ కళా, సాంస్కృతిక వైభవాన్ని కాపాడుతూ మరింత సేవ చేయాలని పలువురు ఆకాంక్షించారు. ఈ సందర్భంగా రెడ్డి రత్నాకర్ రెడ్డి మాట్లాడుతూ, తన సేవలను గుర్తించి “ప్రైడ్ ఆఫ్ తెలంగాణ–2026” అవార్డుకు ఎంపిక చేయడం ఎంతో ఆనందంగా, గర్వంగా ఉందని తెలిపారు.



