
నందమూరి వారసుడితో శ్రీలీల జోడీ
టాలీవుడ్లో వరుస అవకాశాలు దక్కించుకుంటున్న శ్రీలీలకు మరో క్రేజీ ప్రాజెక్ట్‌లో ఛాన్స్ వచ్చినట్లు సినీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది.
నందమూరి బాలకృష్ణ తనయుడు మోక్షజ్ఞ తేజ హీరోగా పరిచయం కానున్న సినిమాలో ఆమె కథానాయికగా నటించబోతున్నట్లు టాక్ వినిపిస్తోంది.
ఈ చిత్రానికి ‘బింబిసార’, ‘విశ్వంభర’ చిత్రాల దర్శకుడు వశిష్ఠ మల్లిడి దర్శకత్వం వహించనుండగా, మైత్రీ మూవీ మేకర్స్ నిర్మిస్తోంది.
సోషియో ఫాంటసీ కథాంశంతో రూపొందనున్న ఈ మూవీని ఇప్పటికే అధికారికంగా ప్రకటించారు.
హీరోయిన్ కోసం పలువురు టాలీవుడ్, బాలీవుడ్ భామలను పరిశీలించిన మేకర్స్ చివరకు శ్రీలీలను ఎంపిక చేసినట్లు సమాచారం.
‘భగవంత్ కేసరి’లో బాలకృష్ణకు కూతురిగా నటించిన శ్రీలీలతో ఆయనకు మంచి అనుబంధం ఏర్పడిన నేపథ్యంలోనే ఈ అవకాశం దక్కినట్లు తెలుస్తోంది.
ఈ సినిమాలో బాలకృష్ణ అతిథి పాత్రలో కనిపించే అవకాశముందని సమాచారం.ఇదిలా ఉంటే శ్రీలీల ప్రస్తుతం తెలుగు సినిమాలకు కాస్త దూరంగా ఉంటూ కోలీవుడ్, బాలీవుడ్ ప్రాజెక్టులతో బిజీగా ఉంది.





