Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
బోనాల ఉత్సవాలకు నిధుల కేటాయింపుపై బండి సంజయ్ ఫైర్!
క్విక్ టుడే న్యూస్, తెలంగాణ :- సికింద్రాబాద్ ఉజ్జయిని మహంకాళి బోనాల సందర్భంగా భక్తులకు కనీస సౌకర్యాలు కల్పించలేదని కేంద్రమంత్రి బండి సంజయ్ రాష్ట్ర ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
పండుగల నిర్వహణకు రాష్ట్ర ప్రభుత్వం అనుసరిస్తున్న తీరును ఆయన తప్పుబట్టారు.రంజాన్ పండుగకు రూ.33 కోట్లు కేటాయించిన ప్రభుత్వం, 80 శాతం జనాభా ఉన్న హిందువుల పండుగైన బోనాలకు కేవలం రూ.20 కోట్లు మాత్రమే ఇవ్వడమేంటని ఆయన ప్రశ్నించారు.
"పండుగల నిర్వహణకు హిందువులు బిచ్చమెత్తుకోవాలా?" అని ఆయన ఆగ్రహం వ్యక్తం చేశారు.
జనాభా ప్రాతిపదికన పండుగలకు నిధులు కేటాయించాలని బండి సంజయ్ డిమాండ్ చేశారు.





