Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
చంద్రబాబు పాలనపై జగన్ తీవ్ర విమర్శలు
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- ఆంధ్రప్రదేశ్లో నారాసుర పాలనతో అరాచకం పరాకాష్టకు చేరిందని వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రంగా విమర్శించారు.
వైసీపీ నేతల అరెస్టులను ఆయన తీవ్రంగా ఖండించారు.
ఎక్స్ (ట్విట్టర్) వేదికగా ఆయన స్పందిస్తూ, దాడి చేసిన వారికి సీఎం చంద్రబాబు రక్షణ కల్పిస్తూ, బాధితులపైనే కేసులు పెట్టి రాజకీయ కక్షసాధింపులకు పాల్పడుతున్నారని మండిపడ్డారు.
"ప్రశ్నిస్తే కేసులు పెడతారా?
ఇదేనా ప్రజాస్వామ్యం?" అని ఆయన ప్రభుత్వాన్ని నిలదీశారు.
ఎన్ని కేసులు పెట్టినా వైసీపీ వెనక్కి తగ్గదని, అన్యాయాన్ని ఎదిరిస్తుందని జగన్ స్పష్టం చేశారు.
ప్రశ్నించే గొంతులను నొక్కే ప్రయత్నం చేస్తున్నారని ఆయన ఆరోపించారు.





