Back to FeedQuickToday Shorts

General
Aug 4, 2026Short Read
మాజీ గవర్నర్ డి.వై.పాటిల్ కన్నుమూత!
క్విక్ టుడే న్యూస్, ఆగష్టు 4 :- ప్రముఖ విద్యావేత్త, బీహార్, త్రిపుర, పశ్చిమ బెంగాల్ రాష్ట్రాలకు మాజీ గవర్నర్‌గా పనిచేసిన డాక్టర్ డి.వై.పాటిల్ (90) కన్నుమూశారు.
కొంతకాలంగా అనారోగ్యంతో, వృద్ధాప్య సమస్యలతో బాధపడుతున్న ఆయన తుదిశ్వాస విడిచారు.1935 అక్టోబర్ 22న మహారాష్ట్రలో జన్మించిన డాక్టర్ పాటిల్, దేశ విద్యా రంగానికి విశేష కృషి చేశారు.
ఆయన ప్రసిద్ధ డి.వై.పాటిల్ గ్రూప్‌ను స్థాపించారు.
ఈ విద్యాసంస్థల ద్వారా దేశవ్యాప్తంగా 182 కి పైగా విద్యాసంస్థలను, ఏడు విశ్వవిద్యాలయాలను ఆయన ఏర్పాటు చేయడం గమనార్హం.
ఆయన మృతి పట్ల పలువురు ప్రముఖులు సంతాపం వ్యక్తం చేశారు.





