Back to FeedQuickToday Shorts

General
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
దీపిక-రణ్వీర్ దంపతులకు పండంటి ఆడబిడ్డ జననం!
బాలీవుడ్ స్టార్ కపుల్ దీపిక పదుకొనె - రణ్వీర్ సింగ్ దంపతులకు రెండో సంతానంగా ఆడబిడ్డ జన్మించింది.
తమకు ఇవాళ పండంటి ఆడపిల్ల పుట్టినట్లు స్వయంగా దీపిక తమ అధికారిక ఇన్స్టాగ్రామ్ ఖాతా ద్వారా సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ ఈ సంతోషకరమైన విషయాన్ని అభిమానులతో పంచుకున్నారు.ఈ ప్రముఖ జంట 2018 సంవత్సరంలో వివాహ బంధంతో ఒక్కటి కాగా, వీరికి గతంలో 2024 సెప్టెంబర్‌లో మొదటి సంతానంగా 'దువా' జన్మించింది.
ఇప్పుడు రెండో పాప ఆగమనంతో దీపిక-రణ్వీర్ ఇంట సంబరాలు అంబరాన్ని అంటాయి.
ఈ గుడ్ న్యూస్ తెలుసుకున్న బాలీవుడ్ ప్రముఖులు, సెలబ్రిటీలు మరియు అభిమానులు ఈ స్టార్ కపుల్‌కు సోషల్ మీడియా వేదికగా పెద్దఎత్తున శుభాకాంక్షలు తెలుపుతున్నారు.
Tags:#General#National#Shorts





