Back to FeedQuickToday Shorts

General
Oct 9, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
జాతీయ క్రీడల పోటీలకు ఎంపికైన ఎక్సైజ్ శాఖ ఉద్యోగి
రాష్ట్రస్థాయి సెలక్షన్ ట్రయల్స్‌లో ప్రథమ స్థానంఅధికారుల అభినందనలు
జనగామ, అక్టోబర్ 09 (క్విక్ టుడే న్యూస్):
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగుల కోసం నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ టోర్నమెంట్ రాష్ట్రస్థాయి సెలక్షన్ ట్రయల్స్‌లో జనగామ ఎక్సైజ్ శాఖ ఉద్యోగి ప్రథమ స్థానం సాధించి జాతీయస్థాయి క్రీడా పోటీలకు ఎంపికయ్యారు. ఈ నెల 7, 8 తేదీల్లో హైదరాబాద్‌లోని జింఖానా గ్రౌండ్లో నిర్వహించిన సెలక్షన్ ట్రయల్స్‌లో ఈ ఘనత సాధించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపిక కావడంతో జనగామ ఎక్సైజ్ స్టేషన్ ఎన్హెచ్బీఆర్జీ.శ్రీనివాసరావు, సబ్ ఇన్స్పెక్టర్ ఎం.డి.యూసఫ్‌తో పాటు సిబ్బంది జె. నర్సిరెడ్డి, రామనందన్ రెడ్డి అభినందనలు తెలిపారు. జాతీయస్థాయి పోటీల్లోనూ ప్రతిభ కనబరిచి విజయం సాధించాలని ఆకాంక్షించారు.



