
చౌడారం గ్రామంలో ఘనంగా సేవా కార్యక్రమాలు
జనగామ, అక్టోబర్ 16 (క్విక్ టుడే న్యూస్):
జనగామ మండలం చౌడారం గ్రామంలో గ్రామ సర్పంచ్ కర్ల పద్మ భార్గవ్ రామ్ రెడ్డి ఆధ్వర్యంలో పలు సేవా కార్యక్రమాలు ఘనంగా నిర్వహించబడ్డాయి.
ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా కొమ్మూరి ప్రతాప్ రెడ్డి హాజరయ్యారు.
స్థానిక ప్రజల సమక్షంలో మహిళలకు చీరల పంపిణీతో పాటు అర్హులకు సైకిళ్లను అందజేశారు.
అలాగే, ఆడపిల్లల సంక్షేమాన్ని ప్రోత్సహించే లక్ష్యంతో గ్రామంలో నవజాత ఆడపిల్లలకు ఒక్కొక్కరికి ₹5,000 చొప్పున ఆర్థిక కానుకను అందజేశారు.
ఈ సందర్భంగా సర్పంచ్ కర్ల పద్మ భార్గవ్ రామ్ రెడ్డి మాట్లాడుతూ..
ఆడపిల్లల సంక్షేమం, మహిళల అభివృద్ధి మరియు గ్రామ ప్రజల సేవే ధ్యేయంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్లు తెలిపారు.
ఈ సేవా కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేసిన ప్రజాప్రతినిధులకు, నాయకులకు, కార్యకర్తలకు మరియు గ్రామస్తులకు నిర్వాహకులు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు.





