Back to FeedQuickToday Shorts

General
Sep 20, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
నాని - శ్రీకాంత్ ఓదెల క్రేజీ కాంబో 'ప్యారెడైజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్ ఫిక్స్!
నేచురల్ స్టార్ నాని మరియు టాలెంటెడ్ డైరెక్టర్ శ్రీకాంత్ ఓదెల కాంబినేషన్లో తెరకెక్కుతున్న హైలీ ఆంటిసిపేటెడ్ మూవీ 'ప్యారెడైజ్' ప్రీ రిలీజ్ ఈవెంట్ డేట్‌ను చిత్ర యూనిట్ అధికారికంగా ప్రకటించింది.
ఈ నెల 21వ తేదీన హైదరాబాద్‌లోని శిల్పకళా వేదిక వేదికగా ఈ వేడుకను అత్యంత వైభవంగా నిర్వహించనున్నట్లు మేకర్స్ వెల్లడించారు.
'జడల్ జమానా తన అడ్డాకు చేరుకుంది' అంటూ సరికొత్త క్యాప్షన్‌తో రిలీజ్ చేసిన పోస్టర్ ప్రస్తుతం సినిమాపై అంచనాలను విపరీతంగా పెంచేస్తోంది.
కాగా ఈ సినిమా ప్రపంచవ్యాప్తంగా ఈ నెల 24వ తేదీన గ్రాండ్‌గా రిలీజ్ కానుంది.
ఇప్పటికే ఈ చిత్రం నుంచి విడుదలైన 'ఆయా షేర్', 'యేష నాగుల' సాంగ్స్ సోషల్ మీడియాలో సెన్సేషన్ క్రియేట్ చేస్తూ చార్ట్‌బస్టర్‌గా నిలిచాయి.
Tags:#General#National





