GeneralNational
పండుగ పూట షాక్.. వినాయక చవితి వేళ చుక్కలనంటిన పూలు, పండ్ల ధరలు!
Editorial Team
|1 min read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు

వివాహ, పండుగ సీజన్ వచ్చిందంటే చాలు సామాన్యులకు ధరల మోత తప్పడం లేదు. వినాయక చవితి వేళ తెలుగు రాష్ట్రాల్లో పూలు, పండ్ల ధరలు ఒక్కసారిగా భారీగా పెరిగాయి. తెలంగాణలోనే అతిపెద్ద పూల మార్కెట్ (హైదరాబాద్) లో సాధారణంగా బంతిపూల ధర కిలో రూ.70 ఉండగా, అది కాస్తా రూ.150కి చేరింది. అలాగే 50 గ్రాముల చామంతులు రూ.50 వరకు పలుకుతున్నాయి.ఇక పూలతో పాటు పూజా సామాగ్రి ధరలు కూడా విపరీతంగా పెరిగాయి. టెంకాయల ధరలు సైతం రూ.40-50కి చేరగా, వెలగపండు రూ.50కి చేరింది. సాధారణ రోజుల్లో డజన్ అరటిపండ్లు రూ.50 ఉండగా, పండుగ రద్దీ కారణంగా ఇప్పుడు రూ.80కి అమ్ముతున్నారు. ఇలా మిగతా పూలు, పండ్ల రేట్లు కూడా విపరీతంగా పెరగడంతో సామాన్య ప్రజలు ఆందోళన చెందుతున్నారు.
Tags:#General#National#QuickToday



