Back to FeedQuickToday Shorts

General
Aug 3, 2026Short Read
తీర ప్రాంత రక్షణకు ప్రభుత్వం భారీ ప్రాజెక్ట్!
క్విక్ టుడే న్యూస్, ఏపీ :- ఆంధ్రప్రదేశ్ తీరప్రాంత రక్షణ కోసం ప్రభుత్వం భారీ ప్రాజెక్టును చేపడుతోంది.
ఇందులో భాగంగా 'గ్రేట్ గ్రీన్ వాల్' ప్రాజెక్టును అమలు చేయనున్నట్లు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ప్రకటించారు.
5 కిలోమీటర్ల వెడల్పుతో, 1,053 కిలోమీటర్ల పొడవున తీరం వెంట మూడంచెల రక్షణ వ్యవస్థను ఏర్పాటు చేస్తున్నామని ఆయన తెలిపారు.ఈ ప్రాజెక్టు పనులపై అధికారులతో సమీక్ష నిర్వహించిన ఆయన, ఈ ఏడాది 8,888 హెక్టార్లలో పనులను విస్తరిస్తామని చెప్పారు.
ఇందులో 5,000 హెక్టార్లలో తాటి వనాలను పెంచడం ద్వారా తీరప్రాంత పర్యావరణాన్ని పరిరక్షించనున్నట్లు తెలిపారు.
అసాధారణ వాతావరణ పరిస్థితులు, తుఫానులు వంటి ప్రకృతి విపత్తుల నుండి తీర ప్రాంతాలను రక్షించడంలో ఈ 'గ్రేట్ గ్రీన్ వాల్' కీలకపాత్ర పోషిస్తుందని ఆయన స్పష్టం చేశారు.





