
నా హృదయంలో భారత్‌కు ప్రత్యేక స్థానం: షేన్ వాట్సన్
ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ షేన్ వాట్సన్ భారత్‌పై తనకున్న అభిమానాన్ని చాటుకున్నారు.
సిడ్నీలో జరిగిన స్వాతంత్ర్య దినోత్సవ వేడుకల్లో పాల్గొన్న ఆయన, భారత్ తనకు రెండో ఇల్లు లాంటిదని పేర్కొన్నారు.ఆస్ట్రేలియాతో పోలిస్తే భారతీయ క్రికెట్ అభిమానుల నుంచే తనకు ఎక్కువ ఆదరణ, ప్రేమ లభిస్తున్నాయని వాట్సన్ అన్నారు.
వారితో తనకు విడదీయరాని బంధం ఏర్పడిందని తెలిపారు.
తన సొంత దేశంలో ఎదుర్కొన్నన్ని విమర్శలు ఇండియాలో ఎప్పుడూ రాలేదని ఆయన గుర్తు చేసుకున్నారు.
ఇక్కడి ప్రజల ఆప్యాయతే కాకుండా, భారతదేశపు శాఖాహార భోజనం కూడా తనకు ఎంతో ఇష్టమని వాట్సన్ ప్రశంసించారు.
ఐపీఎల్లో రాజస్థాన్ రాయల్స్, చెన్నై సూపర్ కింగ్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్లకు వాట్సన్ ప్రాతినిధ్యం వహించిన విషయం తెలిసిందే.





