Back to FeedQuickToday Shorts

General
Aug 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
వరల్డ్ ఛాంపియన్షిప్: ముగిసిన పీవీ సింధు పోరాటం, ప్రత్యర్థి వ్యూహంపై అసంతృప్తి
ప్రపంచ బ్యాడ్మింటన్ ఛాంపియన్షిప్లో భారత స్టార్ షట్లర్ పీవీ సింధు పోరాటం రౌండ్-16లోనే ముగిసింది.
చైనాకు చెందిన వాంగ్ జియీతో జరిగిన హోరాహోరీ పోరులో సింధు 11-21, 21-15, 17-21 తేడాతో ఓటమిని చవిచూసింది.
మ్యాచ్ సందర్భంగా వాంగ్ జియీ పదే పదే మెడికల్ టైమ్ అవుట్ తీసుకోవడంపై సింధు అసంతృప్తి వ్యక్తం చేసింది.గాయం నెపంతో ఆమె అలా చేయడం బహుశా ఆమె వ్యూహంలో భాగం కావచ్చని సింధు పేర్కొంది.
తాను గేమ్ మీద పూర్తి ఏకాగ్రత పెట్టినప్పటికీ, చివరి నాలుగు పాయింట్ల వద్ద మ్యాచ్ చేజారిందని ఆమె విచారం వ్యక్తం చేసింది.
Tags:#General#National#Shorts





