Back to FeedQuickToday Shorts

General
Jul 31, 2026Short Read
రాజుపేట గ్రామ సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి...
ఎమ్మెల్యే పాయం వినతిపత్రం అందజేసిన పట్టణ అధ్యక్షులు, గ్రామస్థులు....
భద్రాద్రి జిల్లా ప్రతినిధి,( క్విక్ టు డే న్యూస్).
మణుగూరు పట్టణంలోని రాజుపేట గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాలు తదితర మౌలిక వసతుల సమస్య లను పరిష్కరించాలని కోరుతూ పట్టణ కాంగ్రెస్ అధ్యక్షులు కురం రవి ముదిరాజ్ స్థానిక గ్రామస్తులతో కలిసి శుక్రవారం ఎమ్మెల్యే పాయం వెంకటే శ్వర్లుకు క్యాంపు కార్యాల యంలో వినతి పత్రాన్ని అందజేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే గ్రామ ప్రజలతో మాట్లాడుతూ సంబంధిత అధికారులతో మాట్లాడి సమస్యలను పరిశీలించి, వీలైనంత త్వరలో రాజుపేట గ్రామంలో రోడ్లు, డ్రైనేజీ, వీధి దీపాల సమస్యల పరిష్కారానికి అవసరమైన చర్యలు తీసుకుంటాన ని గ్రామ ప్రజలకు హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో శివాలయం కమిటీ చైర్మన్ కూచిపూడి బాబు,పట్టణ కాంగ్రెస్ నాయకులు చెవుల రవి కుమార్, దాసరి లింగయ్య,భాస్కర్ రెడ్డితో పాటు గ్రామ పెద్దలు,స్థానికులు పాల్గొన్నారు.





