Back to FeedQuickToday Shorts

General
Aug 5, 2026Short Read
ప్రభుత్వ స్కూళ్లలో 'సిక్ రూమ్స్' ఏర్పాటు : ఏపీ ప్రభుత్వం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థుల ఆరోగ్యం పట్ల కీలక నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులకు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు 'సిక్ రూమ్స్' ఏర్పాటు చేస్తోంది. విద్యార్థులు అకస్మాత్తుగా అనారోగ్యానికి గురైనా, లేదా గాయపడినా తక్షణమే ప్రథమ చికిత్స అందించేందుకు ఈ గదులు ఉపయోగపడతాయని అధికారులు తెలిపారు. తొలి దశలో 629 పీఎంశ్రీ స్కూళ్లకు ఈ సదుపాయం కల్పించనున్నారు. ఇందుకోసం ఒక్కో పాఠశాలకు రూ. 5 లక్షల చొప్పున నిధులు కేటాయించినట్లు అధికారులు వెల్లడించారు. ఈ సిక్ రూమ్స్‌లో బెడ్, మందులతో పాటు స్థానిక ANM (ఆక్సిలరీ నర్స్ మిడ్వైఫ్) సేవలు కూడా అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. రాబోయే నెల రోజుల్లో ఈ సిక్ రూమ్స్‌ను అందుబాటులోకి తెచ్చేలా ప్రభుత్వం వేగంగా అడుగులు వేస్తోంది.




