Back to FeedQuickToday Shorts

International
Sep 10, 2026Short Read
సౌత్ కొరియాలో అత్యంత ఖరీదైన విడాకులు: మాజీ భార్యకు రూ.17,700 కోట్లు!
సౌత్ కొరియాకు చెందిన ప్రముఖ గేమింగ్ సంస్థ 'స్మైల్ గేట్' వ్యవస్థాపకుడు క్వాన్ హల్యాక్-బిన్కు అక్కడి స్థానిక కోర్టు బిగ్ షాక్ ఇచ్చింది.
విడాకుల సెటిల్మెంట్లో భాగంగా తన మాజీ భార్య 'లీ'కి కంపెనీ వాటాలో 35 శాతం ఇవ్వాలని తీర్పునిచ్చింది.
దీని విలువ సుమారు 2.55 ట్రిలియన్ వన్లు (భారత కరెన్సీలో రూ.
17,700 కోట్లు).
దక్షిణ కొరియా చరిత్రలోనే అత్యంత ఖరీదైన విడాకుల సెటిల్మెంట్గా ఇది నిలిచింది.
2001లో వీరికి వివాహం కాగా, కంపెనీ ప్రారంభ సమయంలో క్వాన్కు లీ ఆర్థికంగా ఎంతో సహాయం చేసిందని ఆమె తరఫు న్యాయవాదులు కోర్టులో వాదించారు.





