Back to FeedQuickToday Shorts

International
Sep 25, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
గోధుమల కోసం భారత్‌ను ఆశ్రయించిన బంగ్లాదేశ్
కొంతకాలంగా భారత్‌తో విబేధాలు చూపిస్తున్న బంగ్లాదేశ్, ఇప్పుడు తమ ఆహార అవసరాల కోసం మన దేశం పైనే ఆధారపడుతోంది.
రష్యా-ఉక్రెయిన్ యుద్ధం ఎఫెక్ట్‌తో బంగ్లాదేశ్‌లో గోధుమల ధరలు ఏకంగా 17 శాతం మేర పెరిగాయి.
దీనికి తోడు బియ్యం ధరలు కూడా భారీగా పెరగడంతో, అక్కడి ప్రజలు రొట్టెలు తినేందుకు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు.దీంతో ఆ దేశంలో గోధుమలకు తీవ్ర డిమాండ్ ఏర్పడింది.
ఈ పరిస్థితిని అధగమించేందుకు 2022 తర్వాత తొలిసారిగా బంగ్లాదేశ్ మళ్లీ భారత్ నుంచి గోధుమల దిగుమతిని తాజాగా పునరుద్ధరించింది.
ఇందులో భాగంగా ఇప్పటికే ఇండియా నుంచి 2 లక్షల టన్నుల గోధుమలను కొనుగోలు చేసేందుకు బంగ్లాదేశ్ ఆర్డర్ బుక్ చేసుకుంది.
బంగ్లాదేశ్ తాజా పరిస్థితుల దృష్ట్యా ఆహార సంక్షోభాన్ని నివారించేందుకు భారతీయ దిగుమతులపైనే ఆ దేశం పూర్తి భారం వేసింది.



