Back to FeedQuickToday Shorts

International
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మెయిన్ స్ట్రీమ్ మీడియాకు చెక్: ప్రత్యామ్నాయంగా 24/7 ట్రంప్ టీవీ స్ట్రీమింగ్ ప్రారంభం!
డొనాల్డ్ ట్రంప్, ప్రధాన మీడియా సంస్థల మధ్య వివాదం మరింత ముదురుతోంది.
గతంలో తనపై సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్ నిషేధం విధించినప్పుడు 'ట్రూత్ సోషల్' నెట్‌వర్క్‌ను ప్రారంభించిన ట్రంప్, తాజాగా మెయిన్ స్ట్రీమ్ మీడియాకు కూడా అదే తరహాలో గట్టి కౌంటర్ ఇచ్చారు.
వైట్‌హౌస్‌లో ప్రెస్ కవరేజీని ప్రధాన మీడియా సంస్థలు నిలిపివేయడంతో, దానికి ప్రత్యామ్నాయంగా ఏకంగా 24/7 'ట్రంప్ టీవీ' లైవ్ స్ట్రీమింగ్‌ను అందుబాటులోకి తీసుకువచ్చారు.
తొలుత ట్రంప్ మూడు మీడియా సంస్థలను బ్యాన్ చేయగా, దానికి నిరసనగా మిగతా సంస్థలన్నీ వైట్‌హౌస్ కవరేజీని మూకుమ్మడిగా బాయ్‌కాట్ చేసిన విషయం తెలిసిందే.
ఈ నేపథ్యంలోనే సొంత లైవ్ స్ట్రీమింగ్ తెరపైకి వచ్చింది.
ఈ తాజా మీడియా వివాదం మున్ముందు ఇంకెంత దూరం వెళ్తుందో వేచి చూడాల్సిందే.



