
ఎమ్మెల్సీ ఓటు నమోదు వేళ సర్వర్ డౌన్
గడువు సమీపిస్తున్నా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోలేక ఇబ్బందులు పడుతున్న పట్టభద్రులు..
తొర్రూరు నవంబర్ 02(క్విక్ టుడే న్యూస్):
వరంగల్–ఖమ్మం–నల్గొండ పట్టభద్రుల ఎమ్మెల్సీ ఓటు నమోదు ప్రక్రియలో సర్వర్ సమస్యలు పట్టభద్రులను ఇబ్బందులకు గురిచేస్తున్నాయి. ఓటు నమోదు చేసుకునేందుకు ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికి ప్రయత్నిస్తున్నప్పటికీ సర్వర్ సరిగా పనిచేయకపోవడంతో దరఖాస్తులు సమర్పించలేకపోతున్నామని పలువురు పట్టభద్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.మరోవైపు నవంబర్ 6వ తేదీ దరఖాస్తుల స్వీకరణకు చివరి గడువు కావడంతో అర్హులైన పట్టభద్రుల్లో ఆందోళన నెలకొంది.చివరి తేదీ దగ్గర పడుతున్నా సర్వర్ సమస్యలు పరిష్కారం కాకపోవడంపై అసహనం వ్యక్తమవుతోంది.ఎన్నికల అధికారులు వెంటనే స్పందించి సర్వర్ సమస్యలను పరిష్కరించాలని, దరఖాస్తుల ప్రక్రియ సజావుగా సాగేలా చర్యలు తీసుకోవాలని పట్టభద్రులు కోరుతున్నారు. అవసరమైతే గడువు పొడిగించాలని విజ్ఞప్తి చేస్తున్నారు.





