Back to FeedQuickToday Shorts

International
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఎల్నినో ప్రమాద ఘంటికలు: ప్రపంచవ్యాప్తంగా 4.5 లక్షల మంది ప్రాణాలకు ముప్పు!
తీవ్రరూపం దాలుస్తున్న 'సూపర్ ఎల్ నినో' ప్రభావంతో వచ్చే ఏడాది ఫిబ్రవరి నాటికి దాదాపు 4,51,000 మరణాలు సంభవించే అవకాశం ఉందని క్లైమేట్ ఇంపాక్ట్ ల్యాబ్ తన నివేదికలో వెల్లడించింది.
ఈ వాతావరణ మార్పుల ప్రభావం ముఖ్యంగా గ్లోబల్ సౌత్ దేశాలపై చాలా తీవ్రంగా ఉండనుందని హెచ్చరించింది.అధిక ఉష్ణోగ్రతలు, విపరీతమైన వేడి కారణంగా భారతదేశంలో సుమారు 15,800 మంది ప్రాణాలు కోల్పోవచ్చని అంచనా వేసింది.
ఇక ఆఫ్రికాలోని సాహెల్ ప్రాంత పరిధిలోకి వచ్చే నైజర్, నైజీరియా, సుడాన్ వంటి దేశాల్లో అత్యధికంగా 66,800 మంది తీవ్ర ముప్పును ఎదుర్కొంటున్నారని ఈ నివేదిక పేర్కొంది.



