Back to FeedQuickToday Shorts

International
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
మీ పౌరులను కాపాడుకోండి.. భారత్ సహా 47 దేశాలకు జెలెన్స్కీ కీలక హెచ్చరిక!
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ వేదికగా ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ భారత్‌తో పాటు పలు ప్రపంచ దేశాలకు కీలక హెచ్చరికలు చేశారు.
ఉక్రెయిన్‌తో జరుగుతున్న యుద్ధంలో రష్యా..
ఇండియా, నేపాల్, యెమెన్, సౌతాఫ్రికా సహా దాదాపు 47 దేశాలకు చెందిన పౌరులను ఉపయోగిస్తోందని ఆరోపించారు.ఈ సందర్భంగా ఆయా దేశాల ప్రభుత్వాలకు నేరుగా విజ్ఞప్తి చేస్తూ, మీ పౌరులతో రష్యా ఏం చేస్తోందో గమనించి వారిని తక్షణమే కాపాడుకోవాలని సూచించారు.
రష్యా అధ్యక్షుడు పుతిన్ మిమ్మల్ని ఈ యుద్ధంలోకి లాగకుండా చూసుకోవాలని, వారి మూర్ఖత్వానికి మీ ప్రజలు బలికాకుండా అప్రమత్తంగా ఉండాలని స్పష్టం చేశారు.



