Back to FeedQuickToday Shorts

International
Sep 5, 2026Short Read
పెరిగిన 5G ఫోన్ల రేట్లు.. 4G మొబైల్స్‌కు మళ్లీ డిమాండ్!
గతేడాది నుంచి మెమరీ చిప్‌ల ధరలు దాదాపు నాలుగు రెట్లు పెరగడంతో 5G స్మార్ట్ఫోన్ల ధరలు భారీగా ఎగబాకాయి.
దీని ప్రభావంతో భారత మార్కెట్లో 4G ఫోన్ల విక్రయాలు మళ్లీ పుంజుకున్నాయి.2026 రెండో త్రైమాసికంలో (Q2) 4G ఫోన్ల షిప్మెంట్లు 40% మేర పెరిగాయని మార్కెట్ వర్గాలు తెలిపాయి.
వినియోగదారుల ఆసక్తికి తగ్గట్టుగా పలు మొబైల్ కంపెనీలు పాత మెమరీ ఇంటర్ఫేస్తో 4G ఫోన్లను మళ్లీ ప్రవేశపెడుతున్నాయి.
అయితే, ఈ ట్రెండ్ కేవలం తాత్కాలికమేనని, భవిష్యత్తులో 5G మొబైల్స్ వినియోగమే మరింత పెరుగుతుందని టెక్ నిపుణులు అంచనా వేస్తున్నారు.





