Back to FeedQuickToday Shorts

International
Aug 12, 2026Short Read
కొత్త జీవితంలోకి అడుగుపెట్టిన రొనాల్డో, జార్జినా!
ప్రముఖ పోర్చుగల్ ఫుట్బాల్ క్రీడాకారుడు క్రిస్టియానో రొనాల్డో (41), తన చిరకాల భాగస్వామి జార్జినా రోడ్రిగ్జ్ (32)తో వివాహ బంధంలోకి అడుగుపెట్టారు.
పోర్చుగల్లోని కాస్కేయిస్ నగరంలో వీరి ఐదుగురు పిల్లలు, అత్యంత సన్నిహితుల సమక్షంలో ఈ వివాహ వేడుక ఘనంగా జరిగింది.దాదాపు పదేళ్ల పాటు సహజీవనం చేసిన ఈ జంట, ఎట్టకేలకు అధికారికంగా ఒక్కటయ్యారు.
వివాహ ఉంగరాలు ధరించిన ఫోటోను రొనాల్డో తన ఇన్స్టాగ్రామ్ ఖాతాలో అభిమానులతో పంచుకున్నారు.
గత ఏడాది ఆగస్టు 11న వీరి నిశ్చితార్థం జరగ్గా, సరిగ్గా ఏడాది తర్వాత అదే రోజున వీరు పెళ్లి చేసుకోవడం విశేషం.





