Back to FeedQuickToday Shorts

International
Aug 12, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అఫ్గానిస్తాన్‌లో చదువుకు దూరమవుతున్న లక్షలాది మంది బాలికలు
తాలిబన్ల ఆంక్షల కారణంగా అఫ్గానిస్తాన్‌లో సుమారు 24 లక్షల మంది బాలికలు సెకండరీ విద్యకు దూరమయ్యారని యునెస్కో వెల్లడించింది.
గత ఏడాదితో పోలిస్తే ఈ సంఖ్య 2 లక్షలు పెరిగింది.
ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే 2030 నాటికి 40 లక్షల మంది బాలికలు చదువుకు దూరమవుతారని ఆందోళన వ్యక్తం చేసింది.మహిళల విద్యపై ఉన్న ఆంక్షలను వెంటనే ఎత్తివేయాలని యునెస్కో సూచించింది.
ప్రపంచంలో బాలికలను పాఠశాలలకు, మహిళలను విశ్వవిద్యాలయాలకు వెళ్లకుండా అడ్డుకుంటున్న ఏకైక దేశం అఫ్గానిస్తాన్ అని స్పష్టం చేసింది.
ఇది తీవ్రమైన లింగ వివక్షకు నిదర్శనమని పేర్కొంది.



