Back to FeedQuickToday Shorts

International
Sep 3, 2026Short Read
పాక్ కవ్వింపు చర్యలపై ఏక్నాథ్ షిండే స్ట్రాంగ్ వార్నింగ్!
ఇటీవల జరిగిన SCO సమ్మిట్ గ్రూప్ ఫొటోలో భారత ప్రధాని నరేంద్ర మోడీ చిత్రాన్ని పాకిస్థాన్ ఉద్దేశపూర్వకంగా క్రాప్ చేసి పోస్ట్ చేయడంపై మహారాష్ట్ర డిప్యూటీ సీఎం ఏక్నాథ్ షిండే తీవ్ర స్థాయిలో మండిపడ్డారు.
భారత్‌ను రెచ్చగొట్టేలా పాకిస్థాన్ ఇలాంటి చర్యలకు పాల్పడటం మానుకోవాలని ఆయన హితవు పలికారు.
ప్రధాని మోడీ కనుక గట్టిగా తలచుకుంటే, అసలు ప్రపంచ పటంలో పాకిస్థాన్ అనే దేశం ఉనికిలోనే లేకుండా చేయగల సత్తా ఆయనకు ఉందని షిండే ఘాటుగా హెచ్చరించారు.
కేవలం ఒక ఫొటో నుంచి మోడీ ఇమేజ్ను తొలగించినంత మాత్రాన, ఇండియాలో గానీ, విదేశాల్లో గానీ ఆయనకున్న అపారమైన కీర్తి, ప్రతిష్టలపై ఎలాంటి ప్రభావం పడబోదని ఆయన స్పష్టం చేశారు.





