
భారత ఆర్థిక వృద్ధిపై S&P, ఫిచ్ సానుకూల అంచనాలు
2026-27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి భారత జీడీపీ వృద్ధి అంచనాలను ప్రముఖ గ్లోబల్ రేటింగ్ సంస్థలు S&P గ్లోబల్, ఫిచ్ భారీగా పెంచాయి. తాజా అంచనాల ప్రకారం, S&P గతంలో ఉన్న 6.6% నుండి 7% కు, ఫిచ్ 6.4% నుండి 6.9% కు వృద్ధి రేటును సవరించాయి.ప్రస్తుత ఆర్థిక సంవత్సరం తొలి త్రైమాసికం (ఏప్రిల్-జూన్) లో పారిశ్రామిక వృద్ధి, ఎగుమతులు, వినియోగదారుల కొనుగోళ్లు, ప్రభుత్వ మూలధన వ్యయం వంటి కీలక రంగాలు ఊహించిన దానికంటే మెరుగైన పనితీరు కనబర్చడమే ఈ సానుకూల అంచనాలకు కారణమని ఆ సంస్థలు స్పష్టం చేశాయి.
గమనార్హం ఏమిటంటే, ఈ రెండు సంస్థల కంటే ముందే మరో అంతర్జాతీయ క్రెడిట్ రేటింగ్ ఏజెన్సీ మూడీస్ కూడా భారత జీడీపీ వృద్ధి అంచనాను 7% కు పెంచడం విశేషం. ఇది భారత ఆర్థిక వ్యవస్థ పటిష్టతను, భవిష్యత్ వృద్ధి పట్ల అంతర్జాతీయ సంస్థలకు ఉన్న నమ్మకాన్ని సూచిస్తుంది.





