Back to FeedQuickToday Shorts

International
Sep 19, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
రష్యా పార్లమెంటు ఎన్నికలు: బరిలో పుతిన్ పార్టీకి ఎదురేలేదు!
రష్యాలో మొత్తం 450 స్థానాలకు గాను పార్లమెంటు ఎన్నికల పోలింగ్ కొనసాగుతోంది.
శుక్రవారం ప్రారంభమైన ఈ ఓటింగ్ రేపటి వరకు జరగనుంది.
ఆ దేశ అధ్యక్షుడు పుతిన్ తన ఓటు హక్కును ఆన్లైన్ ద్వారా వినియోగించుకున్నారు.
ఈ ఎన్నికల్లో పుతిన్ నేతృత్వంలోని 'యునైటెడ్ రష్యా' పార్టీకి వ్యతిరేకంగా ఒక్కరు కూడా పోటీలో లేకపోవడం గమనార్హం.
ఈ పోలింగ్లో ఓటర్లు అభ్యర్థితో పాటు పార్టీకి కూడా ఓటు వేస్తారు.
కాగా, రష్యా స్వాధీనం చేసుకున్న ఉక్రెయిన్ ప్రాంతాల్లోనూ ఈసారి ఎన్నికలు జరుగుతున్నాయి.
Tags:#International#National#Shorts





