Back to FeedQuickToday Shorts

International
Sep 24, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
అమెరికాలో అడుగుపెట్టిన చైనా అధ్యక్షుడు.. అరుదైన స్వాగతం పలికిన ట్రంప్
చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అమెరికాలోని మేరీల్యాండ్ జాయింట్ ఎయిర్‌బేస్‌లో అడుగుపెట్టారు. 2015 తర్వాత తొలిసారిగా తన సతీమణితో కలిసి అమెరికా స్టేట్ విజిట్ కు వచ్చిన ఆయనకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్, ఫస్ట్ లేడీ మెలానియాతో కలిసి ఘన స్వాగతం పలికారు. ఒక దేశాధినేతను రిసీవ్ చేసుకోవడానికి అమెరికా అధ్యక్షుడు స్వయంగా రన్‌వే వద్దకు వెళ్లడం అత్యంత అరుదైన విషయం. జిన్‌పింగ్ తన రెండు రోజుల పర్యటనలో పలు కీలక అంశాలపై ట్రంప్ తో చర్చించనున్నారు. ముఖ్యంగా ఇరాన్ యుద్ధం, తైవాన్ సంబంధాలు, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ (AI), వాణిజ్యం, ఖనిజాలు తదితర అంశాలపై ఇరు దేశాల నేతలు మంతనాలు జరపనున్నారు. ఈ అరుదైన భేటీకి అంతర్జాతీయంగా ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది.



