Back to FeedQuickToday Shorts

International
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పాకిస్తాన్, తూర్కియేలకు హౌతీల స్ట్రాంగ్ వార్నింగ్!
సౌదీ అరేబియా వ్యవహారాల్లో జోక్యం చేసుకుంటే సహించేది లేదని పాకిస్థాన్, టర్కియే దేశాలను హౌతీలు గట్టిగా హెచ్చరించారు.
ఈ రెండు దేశాలు గనుక తమ బలగాలను రంగంలోకి దించితే, తీవ్ర పరిణామాలు ఎదుర్కోవాల్సి వస్తుందని, ప్రతీకార దాడులు తప్పవని తేల్చి చెప్పారు.వాళ్లు మధ్యలో వస్తే ఉక్కుపాదంతో అణిచివేస్తామని, తగిన గుణపాఠం చెబుతామని హౌతీల నేత మహమ్మద్ అల్ బుఖైతీ స్పష్టం చేశారు.
నిన్ననే హౌతీలు రియాద్ లక్ష్యంగా క్షిపణులతో దాడులు చేసిన విషయం తెలిసిందే.
ఈ పరిణామాల నేపథ్యంలో హౌతీల హెచ్చరికలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.
Tags:#International#National#Shorts





