Back to FeedQuickToday Shorts

International
Sep 21, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
పాఠశాలల్లో బురఖా, నికాబ్లపై నిషేధం దిశగా ఇటలీ అడుగులు
ఇటలీ ప్రధానమంత్రి జార్జియా మెలోని పాఠశాలల్లో బురఖా, నికాబ్లను నిషేధించనున్నట్లు ప్రకటించారు.
సంప్రదాయం ముసుగులో బాలికలు ముఖం దాచుకునేలా ఎవరూ బలవంతం చేయలేరని ఆమె స్పష్టం చేశారు.
ఈ ప్రతిపాదనను క్యాబినెట్లో చర్చించి త్వరలోనే అమలు చేస్తామని ఆమె వెల్లడించారు.
అంతేకాకుండా, విదేశీ విద్యార్థులతో పాటు వారి తల్లిదండ్రులు కూడా విధిగా ఇటాలియన్ భాష నేర్చుకోవాలని మెలోని సూచించారు.
తరగతి గదిలో ఎంతమంది విదేశీ విద్యార్థులు ఉండాలనే అంశంపై కూడా త్వరలో చర్చిస్తామని ఆమె తన ప్రకటనలో పేర్కొన్నారు.
Tags:#International#National#Shorts





