Back to FeedQuickToday Shorts

International
Sep 22, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఇరాన్ ఎయిర్‌లైన్స్‌పై అమెరికా తీవ్ర ఆంక్షల హెచ్చరిక
అమెరికా, ఇరాన్ మధ్య ఉద్రిక్తతలు తారాస్థాయికి చేరాయి.
ప్రపంచవ్యాప్తంగా కార్యకలాపాలు సాగిస్తున్న ఇరానియన్ ఎయిర్‌లైన్స్ అన్నింటినీ మూసివేస్తామని అమెరికా ట్రెజరీ సెక్రటరీ స్కాట్ బేసెంట్ హెచ్చరించారు.ఇరాన్ విమానయాన సంస్థలకు సేవలు కొనసాగించే విదేశీ సంస్థలపై కఠినమైన 'సెకండరీ ఆంక్షలు' విధిస్తామని స్పష్టం చేశారు.
విదేశాల్లో ఇరాన్ విమానాలకు ల్యాండింగ్ అనుమతులు ఇవ్వడం, ఇంధనం సరఫరా చేయడం వంటివి తక్షణమే నిలిపివేయాలని సూచించారు.ఒకవేళ ఈ ఆదేశాలను ఏ సంస్థ అయినా ఉల్లంఘిస్తే, వాటిని అంతర్జాతీయ డాలర్ చెల్లింపుల వ్యవస్థ (Dollar System) నుంచి తొలగిస్తామని అమెరికా తేల్చిచెప్పింది.
7 నెలల యుద్ధం నేపథ్యంలో అమెరికా తీసుకుంటున్న ఈ తీవ్ర చర్య అంతర్జాతీయంగా చర్చనీయాంశమైంది.



