Back to FeedQuickToday Shorts

International
Sep 6, 2026Short Read
సొంత అభివృద్ధి కోసమే భారత్ ఆయిల్ కొనుగోలు: రష్యా రాయబారి
భారత్ తన సొంత అభివృద్ధి, ఇంధన అవసరాల కోసమే తమ వద్ద ఆయిల్ కొనుగోలు చేస్తోందని, రష్యాకు సాయం చేయాలనే ఉద్దేశంతో కాదని భారత్లోని రష్యా రాయబారి డెనిస్ అలిపోవ్ స్పష్టం చేశారు.
పాశ్చాత్య దేశాల ఆంక్షలను తాము ఖండిస్తున్నామని, ఇండియా ఇంధన అవసరాలు తీర్చేందుకు కట్టుబడి ఉంటామన్నారు.
భారత్ రష్యా ఆయిల్ కొనుగోలు చేసినా, చేయకపోయినా ఉక్రెయిన్-రష్యా యుద్ధానికి పరిష్కారం లభించదని ఇటీవల విదేశాంగ మంత్రి జైశంకర్ వ్యాఖ్యానించారు.
ఈ నేపథ్యంలో రష్యా రాయబారి చేసిన తాజా వ్యాఖ్యలు ప్రాధాన్యత సంతరించుకున్నాయి.





