Back to FeedQuickToday Shorts

International
Sep 6, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
ఎన్నటికైనా పాకిస్థాన్‌తో మనకు ముప్పే : అనిల్ చౌహన్
భారతదేశానికి పాకిస్తాన్ వైపు నుంచి ఎప్పటికీ ముప్పేనని మాజీ సీడీఎస్ అనిల్ చౌహాన్ స్పష్టం చేశారు.
భవిష్యత్తులోనూ పొరుగు దేశం నుంచి భద్రతాపరమైన సవాళ్లు తప్పవని ఆయన హెచ్చరించారు.
ప్రస్తుతానికి తక్షణ సైనిక ప్రతిస్పందన అవసరం లేనప్పటికీ, ఎప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ఏమాత్రం నిర్లక్ష్యం తగదని ఆయన సూచించారు.
పాకిస్తాన్, సౌదీ అరేబియా, టర్కీ దేశాల మధ్య కుదిరిన ఒప్పందాల కారణంగా పాక్ మరింత అతిఉత్సాహం ప్రదర్శించే అవకాశం ఉందని తెలిపారు.
నేటి ప్రపంచంలో దేశాలను శాశ్వత మిత్రులుగా లేదా శత్రువులుగా విభజించి చూడటం కష్టమని, పరిస్థితులకు తగినట్లుగా అంతర్జాతీయ సంబంధాలు మారుతుంటాయని ఆయన ఓ కార్యక్రమంలో విశ్లేషించారు.



