Back to FeedQuickToday Shorts

International
Sep 8, 2026Short Read
మార్కెట్లో 'ఆల్టర్నేట్ ఫ్యూయెల్' వాహనాల జోరు!
పాసింజర్ వాహనాల మార్కెట్లో సిఎన్జీ (CNG), హైబ్రిడ్, ఈవీ (EV) వంటి ప్రత్యామ్నాయ ఇంధన వాహనాల విక్రయాలు వేగంగా పెరుగుతున్నాయి.
ఆగస్టు నెలకు సంబంధించి ఫెడరేషన్ ఆఫ్ ఆటోమొబైల్ డీలర్స్ అసోసియేషన్ (FADA) వెల్లడించిన డేటా ప్రకారం..
మొత్తం సేల్స్‌లో ప్రత్యామ్నాయ ఇంధన వాహనాలు 41.95% వాటాను దక్కించుకోగా, పెట్రోల్/ఇథనాల్ వాహనాలు 40.85% కే పరిమితమయ్యాయి.ఈ ఆల్టర్నేట్ ఫ్యూయెల్ కేటగిరీలో సీఎన్జీ వాహనాలు అత్యధికంగా 25.28%, హైబ్రిడ్ మోడళ్లు 9%, ఎలక్ట్రిక్ వాహనాలు 7.63% సేల్స్ నమోదు చేశాయి.
పెట్రోల్, డీజిల్ వాహనాలతో పోలిస్తే నిర్వహణ ఖర్చులు చాలా తక్కువగా ఉండటమే వినియోగదారులు వీటివైపు మొగ్గు చూపడానికి ప్రధాన కారణమని తెలుస్తోంది.





