Back to FeedQuickToday Shorts

National
Sep 23, 2026Short Read
🔥1.2k+మంది చదివారు24 మంది ఇప్పుడు చదువుతున్నారు
2029 నాటికి డ్రగ్స్ రహిత భారతే లక్ష్యమన్న కేంద్ర హోంమంత్రి అమిత్ షా
భారత్‌ను 2029 డిసెంబర్ 31 నాటికి పూర్తిగా డ్రగ్స్ రహిత దేశంగా మార్చాలని కేంద్ర మంత్రి అమిత్ షా స్పష్టమైన డెడ్‌లైన్ విధించారు.
దిల్లీలో జరిగిన నేషనల్ కాన్ఫరెన్స్ ఆఫ్ యాంటీ-నార్కోటిక్స్ టాస్క్‌ఫోర్స్ సమావేశంలో ఆయన మాట్లాడుతూ, దేశంలోకి ఒక్క గ్రాము మత్తు పదార్థం కూడా రాకూడదని, అలాగే బయటికి పోనివ్వవద్దని స్పష్టం చేశారు.
కేవలం డ్రగ్స్ పట్టుకున్నట్లు వచ్చే వార్తల వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదని, అసలు ఆ మాఫియా నెట్‌వర్క్‌ను పూర్తిగా ధ్వంసం చేసినప్పుడే అనుకున్న లక్ష్యాన్ని చేరుకోగలమని ఆయన అధికారులకు దిశానిర్దేశం చేశారు.



