Back to FeedQuickToday Shorts

National
Sep 3, 2026Short Read
ఉబర్‌లో భారీ తొలగింపులు: 3,300 మంది ఉద్యోగులకు ఉద్వాసన
క్యాబ్ సర్వీసెస్ దిగ్గజం ఉబర్ టెక్నాలజీస్ తన ఉద్యోగులకు భారీ షాక్ ఇచ్చింది.
ప్రపంచవ్యాప్తంగా సుమారు 10 శాతం మంది ఉద్యోగులను, అంటే దాదాపు 3,300 మందిని తొలగిస్తున్నట్లు ప్రకటించింది.కంపెనీ రీకన్స్ట్రక్షన్లో భాగంగా ఈ నిర్ణయం తీసుకున్నట్లు ఉబర్ సీఈఓ దారా ఖోస్రోషాహీ ఉద్యోగులకు మెయిల్ ద్వారా వెల్లడించారు.
సేవలను మరింత సులభతరం చేసేందుకు ఈ మార్పులు చేస్తున్నట్లు ఆయన తెలిపారు.
అలాగే, రిమోట్ వర్క్ విధానానికి కూడా ముగింపు పలుకుతున్నట్లు కంపెనీ స్పష్టం చేసింది.





